GUNTUR DISTRICT NEWS: డొక్కా మిత్రమండలి ఆధ్వర్యంలో ఆత్మీయ అల్పాహార విందు.. కూటమి ప్రముఖులతో లక్ష్మి అపర్ణ

Karthik

గుంటూరు నగరంలో మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ కార్యాలయంలో డొక్కా మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అల్పాహార విందు కార్యక్రమానికి గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి లక్ష్మి అపర్ణ కోవెలమూడి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ జనసేన నాయకులు కిలారి రోశయ్య , గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు, చందు సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, తాడిశెట్టి మురళి, వివిధ డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఆత్మీయంగా పలకరించి, వారితో ముచ్చటించారు. పరస్పర పలకరింపులు, స్నేహపూర్వక సంభాషణలతో ఈ అల్పాహార విందు కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది.

Author
Share This Article
Leave a review