ఓటమి భయంతోనే వైసీపీ నాయకుల అరెస్టులు – మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

Karthik

*ఓటమి భయంతోనే వైసీపీ నాయకుల అరెస్టులు – మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు.**పెదకూరపాడు నియోజకవర్గంలో కొనసాగుతున్న వై యస్ ఆర్ సీపీ నాయకుల అరెస్టుల పర్వం**నాయకులను అరెస్టు చేస్తే వైసీపీ క్యాడర్ భయపడదంటూ ఘాటుగా స్పందించిన – మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు*ఓటమి భయంతోనే స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్న వైసీపీ నాయకులను వెన్నుపోటు పార్టీ పోలీసులతో అరెస్టు చెయించి నామినేషన్ వేయకుండా చేస్తుందని పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు గారు ఆరోపించారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పరిణామాలను చూసి ప్రజలు భయాందోల చెందుతున్నారన్నారు. వైసీపీ తరుపున పోటీ చేసే జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్ వేస్తె, సజావుగా ఎన్నికలు జరిగితే కూటమి అభ్యర్థులు ఓడిపోతారు అనే భయంతోనే పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి, అచ్చంపేట, పెదకూరపాడు, క్రోసూరు, బెల్లంకొండ మండలాల్లోని వై యస్ ఆర్ సీపీ ముఖ్య నాయకులను అరెస్టులు చేసి స్టేషన్లకు తీసుకోనివెళ్తున్నారన్నారు. నామినేషన్ మొదటి రోజు ఐదు మండలాల్లో నామినేషన్ కేంద్రాల వద్ద జరిగిన పరిణామాలను చూస్తే ప్రజాస్వామ్యం ఏమైందని ప్రశ్నించారు. శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసులు వెన్నుపోటు పార్టీ కి కొమ్ముకాస్తు వైసీపీ నాయకులు, కార్యకర్తల పై దాడులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు ఆరోపించారు. రెండున్నర సంవత్సరాలు ప్రజలు మీ రెడ్ బుక్ రాజ్యాంగంతో విసిగిపోయారని త్వరలో మీకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్తారు అని ఘాటుగా విమర్శించారు.

Author
Share This Article
Leave a review