GUNTUR CITY NEWS: కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు భారీ మెజారిటీ ఖాయం – కూటమి మేయర్ అభ్యర్థి గెలుపే ప్రత్యేక కార్యాచరణ

Karthik

గుంటూరు నగర మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోవెలమూడి లక్ష్మీ అపర్ణను 64వ వార్డు కార్పొరేటర్ యర్రంశెట్టి రాజేష్, యర్రంశెట్టి పద్మావతి, సూరి తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 64వ వార్డులో ఆమెకు భారీ మెజారిటీ సాధించి పెడతామని ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా వార్డులో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ప్రజలను నేరుగా కలుసుకుని మద్దతు కూడగట్టేందుకు తమ బృందం కృషి చేస్తోందని తెలిపారు. గుంటూరు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.64వ వార్డులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు భారీ మెజారిటీ సాధించి పెట్టేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. సమష్టి కృషితో ఎన్నికల ప్రచారాన్ని బాగా చేసి కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Author
Share This Article
Leave a review