బాపట్ల జిల్లా, పర్చూరు నియోజకవర్గం, చిన్నగంజాం:-దసరా పండుగను పురస్కరించుకుని చిన్నగంజాం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయుధ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేషన్ ఎస్సై సురేష్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆయుధ పూజలో పాల్గొన్నారు.Bapatla District City News
పండుగ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం సిబ్బందికి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సురేష్తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్: యస్. భాస్కరరావు



