మానసిక ఆరోగ్య వారోత్సవాలు 10వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. సమాజంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, మానసిక సమస్యలపై ఉన్న అపోహలను తొలగించడమే ధ్యేయంగా అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు నిర్వహించే “ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాల” ప్రత్యేక పోస్టర్ను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు.ఈ ఏడాది “జీవిత అనుభవాలను విందాం : నిజమైన గొంతుకలు – నిజమైన మార్పు” (Lived Experiences Heard: Real Voices, Real Change) శీర్షికన అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో శారీరక ఆరోగ్యంతో పాటే మానసిక ఆరోగ్యం కూడా ఎంతో కీలకమన్నారు. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడేవారిని చులకనగా చూడకుండా, వారి బాధలను ఆలకించి (Lived Experiences) వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు రావాలంటే బాధితుల నిజమైన స్వరాలు వినబడాలని, మానసిక సమస్యలు ఉన్నవారు ఎలాంటి సంకోచం లేకుండా నిపుణుల సహాయం తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారోత్సవాల సమయంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థలలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ సమగ్ర వైద్య శాల మానసిక ఆరోగ్య విభాగ అధిపతి, ఆచార్యులు డా. ఉమా జ్యోతి మాట్లాడుతూ సమగ్ర వైద్య శాలలో బాలలు, కౌమార వెల్నెస్ క్లినిక్, వృద్ధుల వైద్య సంరక్షణ, శ్రేయస్సు, వారి ఆరోగ్య సమస్యల నివారణ విభాగం(Geriatric Psychiatry support), ప్రజలకు అవగాహన కల్పించే వ్యవస్థ (Community outreach and awareness), వ్యసనాలు, మాదక ద్రవ్యాల నుండి విముక్తి కల్పించే కేంద్రం (Deaddiction), టెలి మనస (Tele manas) 14416 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. సామాజిక పరిస్థితుల రీత్యా వైద్యుల వద్దకు వచ్చుటకు సందేహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సమగ్ర వైద్య శాల మానసిక ఆరోగ్య విభాగం సహ ఆచార్యులు డా. వి.వి.కిరణ్, సహాయ ఆచార్యులు డా.సతీష్, తదితరులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
28°C
Vijayawada
light rain
28° _ 28°
84%
1 km/h
Mon
27 °C
Tue
33 °C
Wed
33 °C


