Bapatla District City News :ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు జరిగేలా సహకరించాలి-నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. ఎంపీడీవో ధనలక్ష్మి, తహసీల్దార్ ప్రభాకర్

S Sarath
2 Views

చిన్నగంజాం, బాపట్ల జిల్లా:- త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో ధనలక్ష్మి కోరారు. ఎన్నికల్లో ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సూచించారు.

మంగళవారం చిన్నగంజాంలోని ఎంపీడీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులకు సహకరించాలని తెలిపారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, నామినేషన్ల దాఖలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల నియమ నిబంధనలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారుBapatla district City News.

ఈ సమావేశంలో ఎన్నికల అధికారి, ఎస్సై సురేష్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review