Prakasam District News :పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా-దర్శిలో 100 మంది లబ్ధిదారులకు రూ.48.94 లక్షల విలువైన చెక్కుల పంపిణీ

Sharat
1 View

దర్శి: పేద, మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) భరోసాగా నిలుస్తోందని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. దర్శి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 100 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.48,94,427 విలువైన చెక్కులను ఆమె పంపిణీ చేశారు.

వైద్య చికిత్సల కోసం పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన సమయంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందన్నారుPrakasam district News :దర్శిలో జనసేన కార్యకర్తల ఆత్మగౌరవ సమావేశం-కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయం.

వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దొనకొండ మండల టీడీపీ అధ్యక్షుడు మోడీ ఆంజనేయులు, కురిచేడు మండల టీడీపీ అధ్యక్షుడు విడతల నెమిలయ్య, దర్శి మండల టీడీపీ అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, ముండ్లమూరు మండల టీడీపీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, తాళ్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డి, దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షుడు చిన్నతో పాటు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review