Amaravatrhi city news :నేతన్న భరోసా పెన్షన్‌ దరఖాస్తుదారులకు బిగ్‌ రిలీఫ్‌- రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత

Sharat
1 View

అమరావతి: రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ‘నూతన నేతన్న భరోసా’ పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో అత్యంత క్లిష్టంగా మారిన ఓ నిబంధనను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు ఎలాంటి బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు.Amaravathi news

సమస్య ఏమిటి? ప్రభుత్వం స్పందన ఏంటి? ఈ నెల 7 నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, దరఖాస్తు సమయంలో బ్యాంక్ స్టేట్‌మెంట్ తప్పనిసరి చేయడంతో మాస్టర్ వీవర్ల వద్ద రోజువారీ/చేతి వేతనాలు తీసుకునే చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై చేనేత సంఘాల ప్రతినిధులు మంత్రి సవితను కలవగా.. ఆమె వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. నేతన్నల కష్టాలను గుర్తించిన సీఎం, తక్షణమే బ్యాంక్ స్టేట్‌మెంట్ నిబంధనను సడలించాలని ఆదేశించారు.

తాజా మార్గదర్శకాలు ఇవే:

  • బ్యాంక్ స్టేట్‌మెంట్ అక్కర్లేదు: దరఖాస్తుదారులు బ్యాంక్ ఖాతా వివరాల (స్టేట్‌మెంట్) స్థానంలో మాస్టర్ వీవర్ ఇచ్చే ధ్రువీకరణ పత్రం, వేతన వివరాలు సమర్పిస్తే సరిపోతుంది.
  • వయోపరిమితి: 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేత కార్మికులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తారు.
  • అధికారులకు ఆదేశాలు: బ్యాంక్ స్టేట్‌మెంట్లు లేకపోయినా దరఖాస్తులను స్వీకరించాలని జిల్లాల చేనేత, జౌళి శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

నేతన్నల సంక్షేమమే ధ్యేయం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతన్నల ఆర్థిక అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85 వేల మందికి పైగా చేనేతలకు నెలకు రూ.4,000 చొప్పున పెన్షన్ అందిస్తున్నామని, వీటితో పాటు ఉచిత విద్యుత్, ‘నేతన్నల సేవలో’ పథకం ద్వారా ఏడాదికి రూ.25,000 ఆర్థిక సాయం అందజేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వేలాది మంది అర్హులైన చేనేత కార్మికులకు పెన్షన్ బాట సుగమమైంది.

Author
Share This Article
Leave a review