గన్నవరం: సెప్టెంబర్ 11:– కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు–ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా శుక్రవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
కేంద్ర మంత్రి విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) జి. బాలసుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులతో సమన్వయం చేశారు.Krishna district news
నడ్డా పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. విమానాశ్రయ పరిసరాల్లో భద్రతా చర్యలను పటిష్టం చేసి, పర్యటన సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసింది.



