హైదరాబాద్:-11-9-26:-ఉప్పల్ భగాయత్‌లో నిరుపేద ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కేటాయించిన రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని ప్రైవేటు ప్రయోజనాలకు మళ్లించకుండా రక్షించాలని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ చైర్మన్ మిరుదొద్ది శ్యాంసుందర్, నాయకులు మొగులపల్లి ఉపేందర్ తదితరులు మాట్లాడారు.
గతంలో ఈ భూమి కేటాయింపు కోసం కోలేటి దామోదర్, బిగాల గణేశ్‌గుప్తా తదితరులు ఎంతో కృషి చేశారని నాయకులు గుర్తుచేశారు. సదరు స్థలంలో ఫంక్షన్ హాళ్లు, కళ్యాణ మండపాలు వంటి వాణిజ్యపరమైన నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఇవ్వొద్దని కోరారు. దానికి బదులుగా పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఉపయోగపడేలా విద్య, వైద్యం, వసతి వంటి సంక్షేమ కార్యక్రమాలకు, విద్యా సంస్థల నిర్మాణానికే ఈ స్థలాన్ని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారుHyderabad city news :ఫీజుల రీయింబర్స్మెంట్ ‘జీవో 7’ను వెనక్కి తీసుకోవాలి- ఆర్. కృష్ణయ్య డిమాండ్.
మహాసభ నిధులపై సమగ్ర విచారణకు డిమాండ్
ఇదే సమయంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ వ్యవహారశైలిపై ప్రతినిధులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహాసభ నిర్వహించిన ఎన్నికలు, సేకరించిన నిధుల వినియోగం, ట్రస్ట్ ఏర్పాటు మరియు సభ్యత్వాల పంపిణీ ప్రక్రియపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రూ.11 లక్షలు చెల్లించిన వారికే ట్రస్ట్ సభ్యత్వాలు కేటాయిస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు.



