GUNTUR DISTRICT NEWS: 102 జీవోలో వెంటనే మార్పులు చేయాలి: డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు

Karthik

102 జీవోలో తప్పనిసరిగా మార్పులు తీసుకు రావాలని ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మెడికల్ కౌన్సెలింగ్ లో 102 జీవో వల్ల విద్యార్థులకు ఎంతగానో నష్టం జరిగిందని చెప్పారు. 70 మంది రిజర్వేషన్ విద్యార్థులకు దక్కాల్సిన మెడికల్ సీట్లు దక్కలేదని వెల్లడించారు. ఈమేరకు గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ మెడికల్ విద్యార్థులకు జరిగిన నష్టం గురించి హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఓఎస్డీ ని కలిసి పూర్తి వివరాలను అందించామని చెప్పారు. దీనికి అధికారులు స్పందించి భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మెడికల్ సీట్లు విషయంలో రిజర్వేషన్ విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లింది అనే అంశాల గురించి హైకోర్టుకు కూడా వివరిస్తామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా మెడికల్ సీట్లతో రాజకీయ నాయకులు వ్యాపారం చేస్తున్నారని డీబీఎఫ్ నాయకులు కొరివి వినయ్ కుమార్ ఆరోపించారు. పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల రిజర్వేషన్ మెడికల్ విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని చెప్పారు. రిజర్వేషన్ మెడికల్ విద్యార్థుల కోసం చేపట్టే ఉద్యమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన వెల్లడించారు.

Author
Share This Article
Leave a review