చింతలపూడి (ఏలూరు):– ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యండపల్లి సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై శనివారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్ నుండి విజయనగరం వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (AP 39 WQ 3178) యండపల్లి వద్దకు వచ్చేసరికి రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని (KA 56 8893) ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న 17 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, ఎస్ ఐ కె. సతీష్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.#EnergySavings #Eluru #Summer2026 #SolarPower #ElectricityBill #APNews #GreenEnergy
అనంతరం ఏలూరు DCHS బేబీ కమల, జంగారెడ్డిగూడెం DSP బీహెచ్ వెంకటేశ్వర్లు చింతలపూడి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.



