GUNTUR CITY NEWS: గుంటూరులో వైభవంగా కొనసాగుతున్న వినాయక చవితి వేడుకలు

Karthik
1 View

గుంటూరు సీతారాంనగర్ రెండవ లైన్ లో సోము ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వైద్య హాస్పిటల్, ఆర్యన్ ప్రధమ చికిత్సా కేంద్రం సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.బీపీ, షుగర్ ఈసీజీ, స్త్రీల సంబంధించిన సమస్యలకుఉచితంగా వైద్య పరీక్షలు జరిపారు. అదేవిధంగా ఎముకలు, మెదడు, నేరాలకు సంబంధించిన సమస్యలకు కూడా వైద్య పరీక్షలు జరిపి తగిన సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. నాగార్జున కపిల్, డాక్టర్ కె. అపర్ణస్వాతి, డాక్టర్ యు. రవికాంత్, నిర్వహణా కమిటీ ప్రతినిధులు ఎం. మోంజీధర్, శ్రీకాంత్, విజయ్ మణికంఠ, నాగమణి, కళ్యాణ్, గంగా , రాజేష్ బాబు, రాంసాయి, గోపి తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా విశేష పూజల తోపాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు.

Author
Share This Article
Leave a review