Prakasam district News :దర్శిలో జనసేన కార్యకర్తల ఆత్మగౌరవ సమావేశం-కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయం

Sharat
1 View

దర్శి:– దర్శి పట్టణంలోని అభిరామ్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జనసేన పార్టీ కార్యకర్తలు, సాధకుల ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు దక్కుతున్న గౌరవం, రాజకీయ ప్రాధాన్యత, అవకాశాలతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన కార్యకర్తలకు లభిస్తున్న అవకాశాలు, రాజకీయ ప్రాధాన్యతపై సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం, కార్యకర్తల పాత్ర, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

గత రెండున్నరేళ్లుగా పార్టీ కార్యకర్తలకు తగిన స్థాయిలో ప్రాధాన్యత, అవకాశాలు లభించలేదనే అంశాన్ని పలువురు కార్యకర్తలు సమావేశంలో ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వంలో కేటాయిస్తున్న నామినేటెడ్ పదవుల్లో జనసేనకు దక్కాల్సిన వాటా పూర్తిస్థాయిలో లభించడం లేదని అభిప్రాయపడ్డారు.Prakasam district news :దర్శిలో ఉపశమనం- బానుడి తాపానికి వర్షంతో చెక్ — వర్షంలో తడిసిన రోడ్లు, ఉప్పొంగిన రైతాంగం

పార్టీ కార్యకర్తల మధ్య ఐక్యత లోపించడం కూడా ఇందుకు ఒక కారణంగా పలువురు పేర్కొన్నారు. ఇకపై కార్యకర్తల సమస్యలపై సమష్టిగా స్పందించాలని నిర్ణయించారు. జనసేన కార్యకర్తకు ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే పార్టీ శ్రేణులంతా ఒకే తాటిపైకి వచ్చి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంచుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, పరస్పర విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

Author
Share This Article
Leave a review