Prakasam district news :దర్శిలో ఉపశమనం- బానుడి తాపానికి వర్షంతో చెక్ — వర్షంలో తడిసిన రోడ్లు, ఉప్పొంగిన రైతాంగం

Sharat
1 View

దర్శి (ప్రకాశం జిల్లా):– గత ఐదు రోజులుగా భానుడి ప్రచండ ప్రతాపంతో అల్లాడిపోయిన దర్శి మండల ప్రజలకు, రైతాంగానికి శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం తీవ్ర ఊరటనిచ్చింది. ఉదయం 9 గంటల నుంచే సెగలు రేపుతూ అగ్నిగుండంగా మారిన ఎండల వల్ల రోజువారీ పనులకు వెళ్లలేక, నిత్యావసర సరుకులు తెచ్చుకోలేక స్థానికులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.Prakasam district news :దర్శిలో ఘనంగా ఆరో రోజు వినాయక చవితి వేడుకలు — 56 వేల నోట్ల దండతో లంబోదరుడికి ప్రత్యేక అలంకరణ

రోడ్లు జలమయం – కూలిన పందిళ్ళు: దిడగాల్స్ కురిసిన వర్షానికి మండలంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ అకస్మాత్తు వర్షం, గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న పందిళ్లు నేలమట్టమయ్యాయి.

రైతులు, పాడి రైతుల హర్షం: గత కొన్ని నెలలుగా వర్షాలు లేక పంటలు ఎండుముఖం పట్టడమే కాకుండా, పశుగ్రాసం దొరక్క పాడి దిగుబడి పూర్తిగా పడిపోయిందని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ వర్షంతో మెట్ట పంటలకు జీవం పోసినట్లయిందని, ఎండుతున్న పశుగ్రాసం మళ్లీ పచ్చబడి పశువుల మేతకు అనువుగా మారుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇకపై పాడి దిగుబడి కూడా పెరుగుతుందని యజమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Author
Share This Article
Leave a review