అబిడ్స్ (హైదరాబాద్):-మహిళలకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించి, వారిని ఆర్థికంగా స్వావలంభకులుగా తీర్చిదిద్దడమే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు.
గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని అబిడ్స్ జీపీఓ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్’ను ఆయన శనివారం ఘనంగా ప్రారంభించారు.Hyderabad City news
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… మహిళలు అన్ని రంగాల్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. స్వయం సహాయక బృందాల మహిళలు స్వయంగా నిర్వహించే ఈ క్యాంటీన్లకు ప్రజలందరూ ఆదరణ అందించి ప్రోత్సహించాలని కోరారు. ప్రజలకు అత్యంత నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తూ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే కేంద్రీకృత నిలయాలుగా ఈ క్యాంటీన్లు పనిచేయాలని సూచించారు.

కార్యక్రమం అనంతరం ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ మహిళా నిర్వాహకులతో కలిసి ఆప్యాయంగా అల్పాహారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



