చింతలపూడి (ఏలూరు జిల్లా):-పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా పారిశుధ్య పనుల్లో పాల్గొని, చెత్తాచెదారాన్ని తొలగించే ప్రక్రియను పర్యవేక్షించారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుధ్య నిర్వహణలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని అవగాహన కల్పించారు.Eluru City news
ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బందితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, టౌన్ పార్టీ అధ్యక్షుడు తాటి అప్పారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అట్లూరి శ్రీనివాస్ (ఇసుక శ్రీను), కొత్తపూడి శేషగిరిరావు, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు



