Amaravarthi:-దళవాయి రమాదేవి, ఆమె కుటుంబసభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకుడు.. శాసనమండలి సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రమాదేవిని అభినందించిన ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే నిజమైన కార్యకర్తలు, నాయకులను పార్టీ ఎల్లప్పుడూ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు. శాసనమండలి సభ్యురాలిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి మరింత నిబద్ధతతో పనిచేయాలని రమాదేవికి సూచించారు.



