Guntur District City News :తేజస్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం-ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

Sharat
1 View

గుంటూరు: గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు, అన్నపూర్ణ నగర్‌లో ఆదివారం తేజస్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డి హాస్పిటల్‌లోని పలు విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, చికిత్సా విధానాలు, మౌలిక సదుపాయాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ తేజస్వి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

మధ్యతరగతి, సామాన్య ప్రజలకు నాణ్యమైన ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అయోధ్య రామిరెడ్డి సూచించారు. వైద్య రంగంలో మంచి సేవలు అందిస్తూ ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. హాస్పిటల్‌కు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకున్నారు.Guntur City news

కార్యక్రమంలో పలువురు నాయకులు, వైద్యులు, ప్రముఖులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review