GUNTUR CITY NEWS: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Karthik

బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనుల్లో పెండింగ్ ఉన్న3 స్ట్రక్చర్లకు సంబంధించి పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో రానున్నవారం రోజుల్లో పరిష్కరించి, డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ఏపిసిపిడిసిఎల్ అధికారులతో రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ నుండి హనుమయ్య కంపెనీ వరకు రోడ్ విస్తరణ పనులను ఎట్టి పరిస్తితుల్లో వారం రోజుల్లో పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. విస్తరణ ప్రభావితమయ్యే వాటిలో మిగిలిన 3 భవనాల తొలగింపుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్లియర్ గా ఉన్న పోర్షన్లలో డ్రైన్ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు జరిగే సమయంలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గుర్తించిన ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు షిఫ్ట్ చేయాలన్నారు. పనులు జరిగే సమయంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, విస్తరణలో తొలగించిన చెట్లను వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సిటీ ప్లానర్ రాంబాబు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఏసిపి రెహమాన్, ఈఈ విష్ణు, డిఈఈ వెంకటరమణ పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review