విశాఖపట్నం, నవంబర్ 5:- జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు, జీసీసీ ఎండీ ఎస్.ఎస్. శోభిక గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి పరిశీలించారు.
భీమిలి, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి మండలాల పరిధిలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను కంట్రోల్ రూమ్ ద్వారా సమీక్షించారు. ఆయా మండలాల్లో పోలింగ్ కేంద్రాల పరిస్థితి, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, క్షేత్రస్థాయి నుంచి అందుతున్న నివేదికలను పరిశీలించారు.Visakha City News
ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో సందీప్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ యోగిత తదితర అధికారులు పోలింగ్ నిర్వహణ తీరును, ఎప్పటికప్పుడు అందుతున్న సమాచారాన్ని, క్షేత్రస్థాయిలో చేపట్టిన ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకురాలికి వివరించారు.



