Prakasam district News :కార్యకర్తల భద్రతకు టీడీపీ పెద్దపీట-రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత

Sharat
1 View

తాళ్లూరు: కార్యకర్తల సంక్షేమం, భద్రతకు తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తోందని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. తాళ్లూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఊడిగ నాగయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో బుధవారం నాగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కలిసి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వం పొందిన కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. కార్యకర్తలకు పార్టీ సభ్యత్వం రక్షణ కవచంలా ఉంటుందని పేర్కొన్నారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందిన సందర్భాల్లో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రమాద బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ప్రాధాన్యత ఇస్తోందని, పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు అండగా నిలిచే విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. నాగయ్య కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ నాగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.Prakasam district news

కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటకరంగ కార్పొరేషన్ చైర్మన్ బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, టీడీపీ నాయకులు మన్నెం రమేష్, కొర్రపాటి వేణు, రాచకొండ వెంకట్రావు, కైపు నాగార్జున్ రెడ్డి, నవ్వులూరి విద్యాసాగర్, కైపు కోటిరెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review