దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి 13 కోట్ల మంది ఓట్లు తొలగించడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. శుక్రవారం గుంటూరులోని మల్లయ్యలింగం భవన్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నరేంద్ర మోదీ, అమిత్ షాల మెప్పు కోసం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌లోని ఇతర సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదన్నారు.దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ విధానం ద్వారా ఎన్డీఏ కూటమి దీర్ఘకాలం అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సీపీఐ తరఫున పిలుపునిచ్చారు.
GUNTUR DISTRICT NEWS: ఓట్ల తొలగింపు పై సిపిఐ వామపక్షాలు ఆందోళన…చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించాలి.

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
overcast clouds
27° _ 27°
77%
2 km/h
Sat
33 °C
Sun
34 °C
Mon
33 °C


