Prakasam district news :తాళ్లూరు ఎంపీపీ, జడ్పీటీసీలకు ఆత్మీయ సత్కారం-పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులకు ఘనంగా వీడ్కోలు

Sharat
1 View

తాళ్లూరు, సెప్టెంబర్ 23: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, జడ్పీటీసీ పదవీకాలం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. గురువారంతో పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధుల సేవలను గుర్తిస్తూ సాత్విక, గౌరవప్రదమైన వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, తెలుగు యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కార్యక్రమంలో పాల్గొని పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులను సత్కరించారు. తాళ్లూరు మండల పరిషత్ అధ్యక్షురాలు నాగలక్ష్మి, జడ్పీటీసీ మారం వెంకారెడ్డి, వైస్ ఎంపీపీ యిడమకంటి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ సరస్వతి, ప్రభాకర్‌రెడ్డిలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ తాళ్లూరు మండల అభివృద్ధితో పాటు ప్రజలకు సేవలు అందించడంలో ఎంపీపీ, జడ్పీటీసీలు చేసిన కృషిని అభినందించారు. ఐదేళ్ల పదవీకాలంలో ప్రజల సమస్యల పరిష్కారానికి, మండల అభివృద్ధికి వారు అందించిన సేవలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.Prakasam district news

కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగువేణి–సుబ్బారావు, మండల టీడీపీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర నాటకరంగం కార్పొరేషన్ చైర్మన్ బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, టీడీపీ నాయకులు మన్నెం రమేష్, బడే, చిరంజీవి, కొర్రపాటి వేణు, రాచకొండ వెంకట్రావు, కైపు నాగార్జునరెడ్డి, నవ్వులూరి విద్యాసాగర్, కైపు కోటిరెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, కూటమి శ్రేణులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.

Author
Share This Article
Leave a review