సెన్సస్ ఫేజ్-2 (జనాభా గణన) పై జిల్లాస్థాయి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం

Karthik

భారత జనగణన–2027లో భాగంగా ఫేజ్-2 జనాభా గణన నిర్వహణకు సంబంధించి జిల్లాస్థాయి, ఛార్జ్ స్థాయి అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్లో ప్రారంభమైంది.డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ వారి ఆధ్వర్యంలో నవంబర్ 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర సెన్సస్ శిక్షకులు ప్రసన్న కుమార్ అధికారులకు జనాభా గణన విధివిధానాలు, నిర్వహణ పద్ధతులు, అధికారుల బాధ్యతలు తదితర అంశాలపై శిక్షణ అందించారు. జిల్లా సెన్సస్ కోఆర్డినేటర్లు ఆదిలక్ష్మి, రమణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం రాష్ట్ర సెన్సస్ అధికారులు జిల్లా కలెక్టర్ సి యం.సాయికాంత్ వర్మ ను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి, జనాభా గణన ఫేజ్-2 నిర్వహణకు సంబంధించి చేపడుతున్న శిక్షణ కార్యక్రమం ఉద్దేశాలు, కార్యాచరణ, అధికారులకు అందిస్తున్న శిక్షణ వివరాలను వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్, జెడ్పీ సీఈవో జ్యోతి బసు, సీపీఓ శేషశ్రీ, సర్వే ఏడీ వెంకటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review