అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Karthik

వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్షించారు. క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో పాటు… ఆర్టీజీఎస్ అధికారులు పాల్గొన్నారు. వైద్యారోగ్యం, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఇరిగేషన్, మెప్మా, సెర్ప్ వంటి శాఖలు క్షేత్రస్థాయిలో అందిస్తున్న సేవలు, ఉద్యోగులు పనితీరుపై అధికారుల సమర్పించిన నివేదికలను ముఖ్యమంత్రి పరిశీలించారు. అలాగే వివిధ శాఖల పరిధిలోని ఫిర్యాదులను ఏ మేరకు పరిష్కరిస్తున్నారనే అంశంపై సీఎం సమీక్షించారు. ప్రజలకు అందే ప్రభుత్వ సేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Author
Share This Article
Leave a review