గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, విధుల్లో అశ్రద్ధ, అజాగ్రత్తకు ఏమాత్రం తావివ్వకూడదని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. అదివారం నగరపాలక సంస్థప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఎన్నిల ఏర్పాట్లపై అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రస్తుతం బ్యాలెట్ పేపర్ మినహా అన్ని రకాల మెటీరియల్ మరో రెండు రోజుల్లో సిద్దం చేసుకోవాలని, అందుకు విధులు కేటాయించబడిన అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. మెటీరియల్ ని పలుమార్లు తనిఖీ చేసుకొని నిర్ధారణ చేసుకోవాలన్నారు. పిఓలు, ఏపీఓలకు శిక్షణా సమయంలోనే పిఓ హ్యాండ్ బుక్స్ అందించాలని మేనేజర్ ని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను వేగవంతం చేయాలని, అందుకు ప్రత్యేకంగా ఇంజినీరింగ్ అధికారులకు విధులు కేటాయించాలని ఎస్ఈని ఆదేశించారు. ఓటర్ స్లిప్ లను త్వరగా ప్రింట్ చేయించాలని సిటి ప్లానర్ ని, పోలింగ్ కేంద్రాలను రూట్ ఆఫీసర్లతో కలిసి, ముందుగా బస్ లో ట్రయిల్ రన్ చేయాలనీ డిసిపిని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఎక్కడా లోపాలు తలెత్తడానికి వీలు లేదని, ఎప్పటికప్పుడు ప్రతి విభాగం సమన్వయం చేసుకుంటూ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఏ సమస్య ఎదురైనా తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.సమావేశంలో అదనపు కమిషనర్లు ఐ.కిషోర్, జి.రవీంధ్ర (జిఎస్డబ్ల్యూ), డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఈఓఐ ఎలిషా, సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, డిసిపి సూరజ్ కుమార్, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
25°C
Vijayawada
overcast clouds
25° _ 25°
92%
2 km/h
Sun
25 °C
Mon
32 °C
Tue
32 °C


