శిరోరక్ష – ప్రాణరక్ష: హెల్మెట్ తప్పనిసరి అన్న పర్చూరు సి.ఐ. రమణయ్య | Chinnaganjam News

City News Telugu
567 Views

చినగంజాం (పర్చూరు నియోజకవర్గం):“శిరోరక్ష – ప్రాణరక్ష” అనే నినాదంతో ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పర్చూరు సి.ఐ. రమణయ్య పిలుపునిచ్చారు. గురువారం ఉదయం బాపట్ల జిల్లా చినగంజాం మండలం, రామకోటేశ్వర మహాలక్ష్మిమ్మ కాలనీలో వాహనదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా సి.ఐ. మాట్లాడుతూ, బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ కవచంలా పనిచేస్తుందని, నిర్లక్ష్యం వీడి ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించాలని కోరారు. వాహనదారులు తమ వెంట తప్పనిసరిగా వాహన పత్రాలను (RC, Insurance, License) ఉంచుకోవాలని సూచించారు. బాపట్ల

సరైన పత్రాలు లేని పక్షంలో మరియు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చినగంజాం ఎస్సై రమేష్, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు.


Share This Article
Leave a review