జనగణనపై ప్రజలకు అవగాహనకై ఆదివారం ఉదయం 6 గంటలకు కలెక్టరేట్ నుండి నగర పాలక సంస్థ కార్యాలయం వరకు నిర్వహించనున్న 5కే రన్ విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ నగర పాలక సంస్థ విభాగాదిపతులను ఆదేశించారు. 5కే రన్ కు సంబంధించి ఏర్పాట్లపై శనివారం కమిషనర్ ఛాంబర్లో విభాగాదిపతులతో సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, 2027 జనగణన తొలిసారిగా ఆన్లైన్ విధానంలో జరగనున్నదని, ఈ నెల 30 వరకు స్వీయగణనకు అవకాశం కల్పించిందన్నారు. జనగణన పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు వార్డుల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు చేపదుతున్నామని, ఇందులో భాగంగా ఆదివారం జరిగే ర్యాలీ విజయవంతానికి జియంసి విభాగాధిపతులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, సీనియర్ సిటిజన్స్ పాల్గొంటారని, ర్యాలీలో ఎటువంటి సమస్య లేకుండా త్రాగు నీరు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.సదరు సమావేశంలో అదనపు కమిషనర్ (ఇంచార్జ్) జి. సాంబశివరావు, డిప్యుటీ కమిషనర్లు బి. శ్రీనివాసరావు, సి.హెచ్ శ్రీనివాస్, సిటీ ప్లానర్ రాంబాబు, యస్.ఈ జి. వెంకటేశ్వర రావు, సియంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: జనగణన అవగాహన కోసం 5 కె రన్

Total Views: 0
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
35°C
Vijayawada
few clouds
35° _ 35°
43%
5 km/h
Sat
36 °C
Sun
40 °C
Mon
41 °C


