Palnadu Distric News :అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సూరేపల్లి శివకుమార్‌ను పరామర్శించిన డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి

Sharat
1 View

నరసరావుపేట, జూలై 31: నకరికల్లు మండలం నకరికల్లు గ్రామానికి చెందిన సూరేపల్లి శివకుమార్ అనారోగ్యంతో నరసరావుపేటలోని లైఫ్ లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

శివకుమార్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి, ఆయనకు అందుతున్న వైద్య సేవల వివరాలను పరిశీలించారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, రాష్ట్ర బూత్ కమిటీ జనరల్ సెక్రటరీ మేడం ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ పాలూరి రాజశేఖర్ రెడ్డి, పల్నాడు జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు నాలి వెంకట్రావు యాదవ్, నకరికల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి పరమేశ్వర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review