GUNTUR DISTRICT NEWS: జి.ఎస్.టి వసూళ్లు లక్ష్యం సాధించాలి

Karthik

రాష్ట్ర జి.ఎస్.టి వసూళ్లు లక్ష్యం సాధించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. జి.ఎస్.టి వసూళ్లపై  కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ఇంజనీరింగ్ శాఖలు తమ పరిధిలో జరుగుతున్న పనుల వివరాలను అందించాలన్నారు. పన్ను చెల్లింపుదారుల వివరాలు బ్యాంకులు సమర్పించాలని స్పష్టం చేశారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ దీనిని పర్యవేక్షణ చేసి జాబితాలు సమర్పించాలని ఆదేశించారు. జి.ఎస్.టి జాయింట్ కమిషనర్ జాన్ స్టీఫెన్ సన్, డిప్యూటీ కమిషనర్ పి.శ్రీనివాసరావు గుంటూరు 1,2 డివిజన్లలో గల ప్రగతిని వివరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ జి.వి.రమణ మూర్తి, జిల్లా రిజిస్ట్రార్ శైలజ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ఎల్.డి.ఎం మహిపాల్ రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, జి.ఎస్.టి డిప్యూటీ కమిషనర్ జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review