వినుకొండ:– ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామంలో శనివారం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు శ్రీ జి.వి. ఆంజనేయులు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలను రైతులకు నేరుగా అందజేశారు.

ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవీ గారు మాట్లాడుతూ… రైతుల భూములకు భద్రత కల్పిస్తూ, వారికి పూర్తి భూ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా అత్యంత పారదర్శకంగా రాజముద్రతో కూడిన ఈ పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.Palnadu distric news
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు మరియు గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



