Prakasam district news :పోతకమూరులో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ పూడికతీత పనుల పరిశీలన-కూలీలతో నేరుగా మాట్లాడి పనిదినాలు, సమస్యలపై ఆరా.. రోజుకు రూ.312 కూలీ

Sharat
1 View

దర్శి: ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని పోతకమూరు, ఈస్ట్ వీరాయపాలెం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా ధ్వమా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత పోతకమూరు గ్రామంలో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ పూడికతీత పనులను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పూడికతీత పనుల్లో పాల్గొంటున్న శ్రామికులతో ప్రాజెక్ట్ డైరెక్టర్ నేరుగా మాట్లాడారు. వారికి కల్పిస్తున్న పనిదినాలు, పని పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. కేటాయించిన కొలతల ప్రకారం పనిని పూర్తి చేసిన కూలీలకు రోజువారీ వేతనంగా ఒక్కొక్కరికి రూ.312 చెల్లించబడుతుందని తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో కూలీలకు సకాలంలో ఉపాధి కల్పించడంతో పాటు వేతనాల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం ఈస్ట్ వీరాయపాలెం గ్రామంలో వి. శ్రీను లబ్ధిదారుగా చేపట్టిన పశువుల కొట్టం నిర్మాణ పనులను వెంకటేశ్వరరావు పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, లబ్ధిదారునికి అందుతున్న ప్రయోజనాలను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.Prakasam district City News

చెరువులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పూడికతీత పనులతో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, వర్షపు నీటిని సమర్థవంతంగా నిల్వ చేయడంతో పాటు భూగర్భ జలాల అభివృద్ధికి దోహదపడుతుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సహజ నీటి వనరుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని, కూలీలకు సకాలంలో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పనుల అమలులో క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత పెంచాలని తెలిపారు.

ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల సిబ్బంది, వి.బి.-గ్రామ్ జీ సిబ్బంది, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review