PALNADU DISTRICT NEWS: 2026 ఎస్.ఐ.ఆర్ కు బూత్ కమిటీ సభ్యులంతా సిద్ధం కావాలి: విడదల రజిని

Karthik

ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణ, రూరల్ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు)తో చిలకలూరిపేట నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్, మాజీ మంత్రి విడదల రజిని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. బీఎల్వోలు, బీఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, బీఎల్ఏలకు అవసరమైన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబడకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులకు సూచించారు. డ్రాఫ్ట్ దశలోనే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకావని పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు అందుబాటులోకి వచ్చేలోపే బీఎల్ఏలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఓటర్లకు సంబంధించిన అవసరమైన ఆధార పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్నది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కావడంతో ఒకసారి ఓటు తొలగించబడితే తిరిగి చేర్చుకోవడం కష్టసాధ్యమవుతుందని తెలిపారు. అలాగే ఎన్యూమరేషన్ ఫారం సమర్పించినప్పుడే ఓటు హక్కు కొనసాగుతుందనే విషయాన్ని ప్రతి ఓటరుకు వివరించాలని సూచించారు. సెప్టెంబర్ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో పనిచేసే అన్ని బృందాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న దొంగ ఓట్లను గుర్తించి వెంటనే బీఎల్వోలకు ఫిర్యాదులు చేయాలని, మరోవైపు పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగించబడకుండా కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బూత్ కమిటీ సభ్యులు, బీఎల్ఏలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఓటును పరిరక్షించాలని రజిని పిలుపునిచ్చారు.

Author
Share This Article
Leave a review