Vijayawada City news :ధర్నాచౌక్‌ను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు-సచివాలయ ఉద్యోగుల ‘చలో విజయవాడ’కు అనుమతి నిరాకరణ

S Sarath
2 Views

విజయవాడ: ధర్నాచౌక్‌ను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు-సచివాలయ ఉద్యోగుల ‘చలో విజయవాడ’కు అనుమతి నిరాకరణ

‘చలో విజయవాడ’ కార్యక్రమానికి తరలివచ్చే ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోకి ఉద్యోగులు చేరకుండా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు అనుమానితులను నిలువరించారు. ధర్నాచౌక్‌ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారుVijayawada City News.

ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాచౌక్‌ పరిసరాల్లో పోలీసుల మోహరింపుతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగుల నిరసన నేపథ్యంలో విజయవాడలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Author
Share This Article
Leave a review