కర్లపాలెం: కర్లపాలెం మండల కీర్తిని ఢిల్లీ వరకు తీసుకువెళ్లిన యువ పరిశోధకుడు గరిగంటి సుధాకర్ అభినందనీయుడని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు అన్నారు. ఆదివారం స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు సుధాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంకు చెందిన గరిగంటి సుధాకర్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మండలానికి గర్వకారణమన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సోలార్ రీచార్జ్ బ్యాటరీలను తయారు చేయడంలో సుధాకర్ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తన పరిశోధన, ఆవిష్కరణల ద్వారా కర్లపాలెం మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పోలీసురావు కోరారు. సమాజ అభివృద్ధికి ఉపయోగపడే పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.Bapatla District News
ఈ కార్యక్రమంలో కర్లపాలెం రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మందపాటి పరమానంద కుమార్, రాణి, తదితరులు పాల్గొన్నారు.



