చీరాల:- మన రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ చల్లా రామ్మోహన్ రావు పాల్గొని 90 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నెలకు సరిపడా ఉచిత మందులను పంపిణీ చేశారు.
పెరలి నరసయ్య, తిమ్మరాజు కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేత పెరలి బాలకృష్ణమూర్తి సహకారంతో మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ బీపీ, షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తగిన వ్యాయామం చేయడంతో పాటు వైద్యులు సూచించిన మందులను సక్రమంగా వినియోగిస్తే ఆరోగ్యాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలిపారు.
వైద్య శిబిరానికి వచ్చిన వారందరికీ ఎస్‌ఆర్‌కే అధినేత మంతెన సత్యనారాయణ రాజు సహకారంతో అన్నప్రసాదం అందించారు.Bapatla District City news
కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు తిమ్మరాజు వెంకట సుబ్బారావు, కార్యదర్శి సీహెచ్ పిచ్చయ్య, కోశాధికారి బాపిరాజు, కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు, లలిత బాబు, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, జిడుగు వెంకటేశ్వర్లు, తవ్వ స్వామి, కాటూరి బాజీబాబు తదితరులు పాల్గొన్నారు.



