Bapatla District City News :గ్రీవెన్స్‌లో అర్జీలు స్వీకరించిన తహసీల్దార్ ప్రభాకర్-సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సర్వేయర్‌కు ఆదేశం

S Sarath
1 View

బాపట్ల జిల్లా, పర్చూరు నియోజకవర్గం, చిన్నగంజాం:-చిన్నగంజాం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భూ సర్వేకు సంబంధించి మూడు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ ప్రభాకర్ తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం సర్వే చేయాలని కోరుతూ ఆయా అర్జీదారులు తమ వినతిపత్రాలను సమర్పించారు.

గ్రీవెన్స్‌లో స్వీకరించిన అర్జీలను పరిశీలించిన తహసీల్దార్ ప్రభాకర్, సంబంధిత భూములను సర్వే చేసి నివేదిక అందించాలని సర్వేయర్‌కు సూచించారు. అర్జీదారులకు ఇబ్బందులు లేకుండా సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.Bapatla District CIty News

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన మండల అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review