చిన్నగంజాం, అక్టోబర్ 7:– బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా సురేష్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆయన పోలీస్ స్టేషన్లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
ఇప్పటి వరకు చిన్నగంజాం ఎస్సైగా విధులు నిర్వహించిన రమేష్ నెల్లూరు జిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో సురేష్‌ను నియమించారు. గతంలో సురేష్ ఇంకొల్లు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించారు. అక్కడి నుంచి బదిలీపై చిన్నగంజాం ఎస్సైగా నియమితులయ్యారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం సురేష్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతలు, ప్రజల సమస్యలు, పెండింగ్ కేసులు తదితర అంశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రజలకు పోలీసు శాఖ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
చిన్నగంజాం మండల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువచ్చి సహకరించాలని కోరారు.Bapatla District News
నూతన ఎస్సైగా సురేష్ బాధ్యతలు స్వీకరించడంతో పోలీస్ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు


