GUNTUR CITY NEWS: గోవులు రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Karthik

నగరపాలక సంస్థ పరిధిలో గోవులను పెంచుకునే యజమానులు తమ ఆవులను, ఎద్దులను, ఇతర పశువులను రోడ్లపై యదేచ్ఛగా తిరగకుండా ఇంటి వద్దనే ఉంచుకోవాలని, అట్లా కాకుండా రోడ్ల మీదకు వదిలినట్లయితే అది ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నందున వాటిని జిఎంసి గోశాలకి తరలించి, తిరిగి ఇవ్వబడదని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రోడ్లపై ఉండే ఆవులు, ఇతర పశువులను ఢీకొని ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, వివిధ ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధుల ఫిర్యాదుల మేరకు నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ పెట్టి రోడ్లపై తిరుగుతున్నపశువులను ప్రత్యేక వాహనం ద్వారా పట్టి జిఎంసి గోశాలకు తరలిస్తామని తెలిపారు. వాటి యజమానులు వస్తే రోడ్లపై వాటి వలన కల్గే ప్రమాదాలకు వారినే భాధ్యులుగా చేసి, పోలీసు కేసు నమోదు చేస్తామన్నారు. అటువంటి పశువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి యజమానులకు ఇవ్వబడదని కూడా తెలిపారు. కనుక యజమానులు తమ పశువులను ఇళ్ల వద్దనే ఉంచుకోవాలని కోరారు.

Author
Share This Article
Leave a review