మార్కాపురం, సెప్టెంబర్ 28:– ఇందిరమ్మ, సుందరయ్య కాలనీలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో సోమవారం మార్కాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లే కార్డులు ప్రదర్శిస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ ఇందిరమ్మ, సుందరయ్య కాలనీలు ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. కాలనీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ కాలనీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు.
కాలనీల్లో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, రవాణా సదుపాయాలు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.Markapur District News :వెలిగొండ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం-సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం- ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
ఇందిరమ్మ, సుందరయ్య కాలనీల్లో జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించాలని కోరారు. కాలనీలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో 100 మందికి పైగా కాలనీవాసులతో పాటు మార్కాపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, షేక్ బాజీ వలి, బేతం ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.



