దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్‌ఐఆర్) ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్నికల ఎలక్ట్రోల్ రిజిస్టేషన్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. శుక్రవారం స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ బిఎల్ఓలు, బిఎల్ఏలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కమిషనర్, ఈఆర్వో మాట్లాడుతూ ఈ నెల 15 నుండి బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఇంటింటికి వస్తారని, వచ్చినప్పుడు బీఎల్‌వోలు అడిగే పత్రాలను, వివరాలను ప్రజలు ఇప్పుడే సిద్ధం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం బీఎల్‌వోలు మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని, వాటిలో ఓటరు స్వయంగా పూర్తి చేసి బీఎల్‌వోకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఒక ఫారంపై బీఎల్‌వో సంతకం చేసి ఎక్నాలెడ్జ్‌మెంట్‌గా ఓటరుకు అందజేస్తారని చెప్పారు. ప్రజలు తమ ఎపిక్ (ఓటరు గుర్తింపు) కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే 2002 సంవత్సరంలో తాము లేదా తమ కుటుంబ సభ్యులు నమోదు అయి ఉన్నఓటరు జాబితా, పోలింగ్ కేంద్రం వివరాలు, తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు లేదా నానమ్మల ఎపిక్ కార్డులు అందుబాటులో ఉంటే మ్యాపింగ్ ప్రక్రియ మరింత సులభంగా జరుగుతుందని తెలిపారు. వివాహం తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిన మహిళలు, ఇటీవల ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్న వారు, తమ తల్లిదండ్రుల ఓటరు వివరాలను ముందుగానే సేకరించి ఉంచుకోవాలని సూచించారు. పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా ప్రతి ఒక్కరూ బీఎల్‌వోలకు సహకరించి ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, బిఎల్ఏలు కూడా క్షేత్ర స్థాయిలో ఎస్ఐఆర్ పై ప్రజలకు అవగాహన కల్గించాలని కోరారు. ఎస్ఐఆర్ పై శనివారం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రతి పోలింగ్ ప్రాంతంలో ఓటర్ మ్యాపింగ్ పై స్పెషల్ క్యాంప్ లు జరుగుతాయన్నారు.సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ జి.సాంబశివరావు, ఏఈఆర్ఓలు డి.రాంబాబు, సిహెచ్.శ్రీనివాస్, సూరజ్ కుమార్, ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ బాలాజీబాష, డిప్యూటీ తహశీల్దారు నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: ఎస్ఐఆర్’కు ప్రతి ఒక్కరూ సహకరించాలి: కమీషనర్

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
light rain
27° _ 27°
86%
3 km/h
Wed
32 °C
Thu
32 °C
Fri
32 °C


