GUNTUR CITY NEWS: ఎన్టీఆర్ పెన్షన్లు ప్రతి అవ్వాతాతకు భరోసా, గౌరవం అందిస్తున్నాయి: ఎమ్మెల్యే

Karthik

ఎన్టీఆర్ పెన్షన్లు ప్రతి అవ్వాతాతకు భరోసా, గౌరవం అందిస్తున్నాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి “పేదల సేవలో 2.0” కార్యక్రమంలో భాగంగా 23వ డివిజన్ కన్నవారితోట 1వ లైన్‌లోని 80వ సచివాలయం పరిధిలో ఎన్టీఆర్ సామాజిక భద్రత భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చిందంటే రాష్ట్రంలోని అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ బాధితులు, మంచానికే పరిమితమైన వారు ఎంతో ఆతృతగా ఎదురుచూసే రోజు అని అన్నారు. ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఒక పండుగలా మారిందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెన్షన్ల విషయంలో అత్యంత మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తోందని, ఒకటో తేదీ సెలవు రోజు అయినా కూడా లబ్ధిదారులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ముందుగానే పెన్షన్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ నెల 20,800 మందికి పైగా లబ్ధిదారులకు దాదాపు రూ.8.90 కోట్ల విలువైన పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు.పెన్షన్లు అందుకున్న లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందమే ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మందుల కోసం, నిత్యావసరాల కోసం, కుటుంబ భరోసా కోసం ఈ పెన్షన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా కొడుకులు లేని కుటుంబాల్లో కుమార్తెల వద్ద ఉంటున్న వృద్ధులకు ప్రభుత్వం ఒక పెద్దన్నలా అండగా నిలిచి గౌరవప్రదమైన జీవితం అందిస్తోందనే భావన కనిపిస్తోందన్నారు.దివ్యాంగులకు అందిస్తున్న పెన్షన్లు వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయని, డయాలసిస్ బాధితులకు నెలకు రూ.10 వేల చొప్పున అందిస్తున్న ఆర్థిక సాయం వారి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తోందని చెప్పారు. అలాగే మంచానికే పరిమితమైన వారికి నెలకు రూ.15 వేల చొప్పున అందిస్తున్న పెన్షన్ నిజంగా ఆ కుటుంబాలకు పెద్ద అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఒక సామాన్య కుటుంబం నెలంతా కష్టపడితే వచ్చే ఆదాయానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా అందించడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అన్నారు.ప్రజలకు ఇంతటి గౌరవం, భరోసా, ఆర్థిక రక్షణ కల్పిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి చెప్పారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకే ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రజల హృదయాలను గెలుచుకుంటోందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review