ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థను పరిరక్షించేందుకు ఎన్నికల విధానంలో పారదర్శకత, విశ్వసనీయత ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్ అన్నారు. గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.ప్రజల ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమని, ఆ ఓటు హక్కుపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగే విధంగా ఎన్నికల ప్రక్రియ ఉండాలని ఆయన అన్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఓటర్ల హక్కులను కాపాడటంతో పాటు ఓటు హక్కు దుర్వినియోగానికి అవకాశం లేకుండా ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజల ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఎటువంటి అనుమానాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు చైతన్యవంతులై ఐక్యంగా ఉద్యమించాలని జంగాల అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
GUNTUR DISTRICT NEWS: EVM బదులుగా బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
28°C
Vijayawada
overcast clouds
28° _ 28°
89%
2 km/h
Thu
28 °C
Fri
34 °C
Sat
33 °C


