GUNTUR CITY NEWS: విజయదశమి పర్వదినాన ప్రత్యేక పూజలు.. వాకర్స్‌తో ఆత్మీయ సమాగమం

Karthik

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని, గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నమయ్య వాకింగ్ ట్రాక్‌ను సందర్శించి, నడక ప్రియులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. వారిని సాదరంగా పలకరిస్తూ, నగరాభివృద్ధిపై వారి ఆకాంక్షలను, విలువైన అభిప్రాయాలను, సూచనలను ఆసక్తిగా ఆలకించారు. ఆధ్యాత్మిక శోభ, ఆత్మీయ పలకరింపుల నడుమ ఈ కార్యక్రమం సుహృద్భావ వాతావరణంలో సాగింది.

Author
Share This Article
Leave a review