అసలే ఎండ వేడికి ప్రజలు అల్లాడుతుంటే ఈ కొండకు నిప్పుపెట్టడం మరింత ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. కొండపై భారీగా మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల నివాసముంటున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొండ దిగువన ఇళ్లు ఉండటంతో, మంటలు ఎక్కడ తమ నివాసాల వైపు వస్తాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇది కొండ మీద సంచరించే కొన్ని జంతువుల కోసమా లేక మరేదైనా కారణమా?. ఇది కాకతాళీయంగా జరిగిందా లేక కావాలని చేశారా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరపాలని ఉండవల్లి గ్రామస్తులు కోరుతున్నారు.



