Bapatla District News :హైదరాబాద్‌లో ఉన్నా పింఛన్‌కు ఇబ్బంది లేకుండా చొరవ-అనారోగ్యంతో చికిత్స పొందుతున్న లబ్ధిదారురాలి వద్దకే వెళ్లి పింఛన్ అందజేత

S Sarath
1 View

వేటపాలెం:– అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి పింఛన్ అందించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు ప్రత్యేక చొరవ చూపారు. వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని ఆమోదిగిరిపట్నానికి చెందిన ఉప్పాల ఇందిరారాణి కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో వరుసగా రెండు నెలలుగా ఆమె పింఛన్ తీసుకోలేకపోయారు.

మూడో నెల కూడా పింఛన్ అందకపోతే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండటంతో స్థానిక నాయకులు ఈ విషయాన్ని వేటపాలెం ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే.. అనారోగ్యంతో గ్రామానికి రాలేని లబ్ధిదారురాలికి పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే సూచనల మేరకు టీడీపీ వేటపాలెం మాజీ అధ్యక్షుడు నాసిక భద్రయ్య ఆధ్వర్యంలో దేశాయిపేట పంచాయతీ యూడీసీ పద్మావతి, మాజీ వైస్ ప్రెసిడెంట్ వోలుకుల కుమార్ హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఇందిరారాణిని కలిసి పింఛన్ మొత్తాన్ని అందజేశారు.Bapatla District City News

సొంత గ్రామానికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ లబ్ధిదారురాలి వద్దకే వెళ్లి పింఛన్ అందించడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల పరిస్థితులను గుర్తించి సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి అందేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

Author
Share This Article
Leave a review