Krishna District city news :తోట్లవల్లూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

S Sarath
1 View

కృష్ణా జిల్లా (తోట్లవల్లూరు): తోట్లవల్లూరు మండలంలో నూతనంగా నిర్మించనున్న బిటి, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా శంకుస్థాపన చేశారు. జిల్లా టిడిపి అధ్యక్షుడు వీరంకి గురుమూర్తితో కలిసి ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు మెరుగైన, సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. తోట్లవల్లూరు మండల పరిధిలో రూ.2.50 కోట్ల అంచనా వ్యయంతో బిటి రోడ్డుతో పాటు 12 సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు. వీటితో పాటు రూ.56 లక్షల వ్యయంతో పమిడిముక్కల మండలం ఫతేలంకలో బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. అలాగే, రూపుదిద్దుకున్న మరో 12 కొత్త సీసీ రోడ్లను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో కనీసం ఒక్క రోడ్డు నిర్మాణం కూడా చేపట్టలేదని ఎమ్మెల్యే విమర్శించారు. అప్పట్లో ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించిన ప్రతిపక్ష నాయకులు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బురదజల్లే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు.Krishna disrtrict News

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో టిడిపి నాయకులు వీరపనేని శివరాం, రామినేని కుటుంబయ్య, మోహనమంజు, నెక్కలపూడి మురళి, లింగమనేని బాబురావుతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review