GUNTUR DISTRICT NEWS: సేవా దృక్పథంతోనే రాజకీయాల్లోకి లేళ్ళ అప్పిరెడ్డి

Karthik

రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే అతి కొద్ది మంది ప్రజా నాయకులలో లేళ్ళ అప్పిరెడ్డి అగ్రగణ్యుడని వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ (జోన్-3) పోలూరి వెంకటరెడ్డి కొనియాడారు. రాజకీయ రంగంలోనే కాక సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ఆయన ఎప్పుడూ అందరి కన్నా ఒకడుగు ముందే ఉంటారని తెలిపారు.శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర లీగల్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం అరండల్‌పేటలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన బర్త్ డే కేక్‌ను న్యాయవాదులతో కలిసి ఆయన కట్ చేశారు. అనంతరం ప్రమాదవశాత్తు గాయపడి మంచానికే పరిమితమైన పచ్చల అనిల్ అనే న్యాయవాది పిల్లల చదువుకు అవసరమైన 86వేల రూపాయల నగదును వారికి అందజేశారు. ఈ సందర్భంగా పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాల్లో స్వయంకృషితో అత్యున్నత స్థానానికి చేరుకున్న నేత అప్పిరెడ్డి అని తెలిపారు. సమాజానికి సేవ చేయాలన్న దృక్పథంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. అందుకే మొదటి నుంచి కూడా ప్రజోపయోగమైన పనులతోనే ఆయన ముందుకు సాగినట్లు చెప్పారు. అప్పిరెడ్డి స్పూర్తితోనే తాము కూడా న్యాయవాదులుగా విరివిగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలోనే ఆయన జన్మదినోత్సవం సందర్భంగా స్పూర్తి ఫౌండేషన్, ఏరువ జగదీశ్వరి కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పేద విద్యార్ధులకు ఉపకార వేతనాలు అందించినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గుంటూరులో వైసీపీ బలోపేతానికి, వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకు తమ వంతుగా కృషి చేస్తామని పోలూరి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ నేతలు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, కాసు వెంకటరెడ్డి, బడి మంజుల, కళ్ళం వెంకట రమణారెడ్డి, బట్టగిరి వెంకటరమణ, సుదర్శనం క్రాంతి కుమార్, సోని, రాయపూడి శ్రీనివాసరావు, సీడీ భగవాన్, కొమ్మారెడ్డి రామకృష్ణారెడ్డి, వాసం సూరిబాబు, షన్ను, సయ్యద్ బాబు, నలక వేణు, సుబ్బారెడ్డి, శేషకుమారి, వేముల ప్రసాద్, యక్కలూరి కోటి లింగారెడ్డి, రామస్వామిరెడ్డి, వేముల పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review