పర్చూరులో ఈనెల 8న మంత్రి అనిత, ఎమ్మెల్యే ఏలూరి పర్యటన

City News Telugu

B. Sankar, Desk Incharge | Parchur: పర్చూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చేలా ఈనెల 8వ తేదీన రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటించనున్నారని టీడీపీ నాయకులు తెలిపారు. పర్యటనలో భాగంగా కోట్లాది రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పర్చూరు మండల టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి మంత్రి, ఎమ్మెల్యే పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మండల టీడీపీ అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు షేక్ శంషుద్దీన్, కోడూరి శేషా బ్రహ్మచారి మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. ఈనెల 8న జరిగే కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో పోపూరి శీను, నరేంద్ర, కన్నెగంటి సాంబశివరావు, పుల్లల సుబ్బారావు, కాపు రవి, కొరిటాల సురేష్, మామిడిపాక హరి, సిరిగిరి శివనాగేశ్వరరావు, కే. లక్ష్మీబాబు, లక్కీపోగు సుమన్, గిరి, రామ్మోహన్, వట్టిముక్కల అబ్రహం, జూపూడి మార్కు, పున్నయ్య, నాగరాజు, కొండగంటి శివ, సిరిగిరి నాగేశ్వరరావు, సతీష్, ఎస్. సుబ్బారావు, శ్రీధర్, టీ. శ్రీనివాసరావు, కొమ్మలపాటి సురేష్, బి. ఆంజనేయులు, మండల ముస్లిం అధ్యక్షుడు ఖాజావలి, సమీర్, సాంబశివరావు, తలారి శివయ్య, మల్లాది సురేష్, మా భాష, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు

Share This Article
Leave a review